News August 2, 2024

నంద్యాల: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ

image

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి తల్లిబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపు ముర్రుపాలు తాగించాలని, దీంతో బిడ్డకు వ్యాధి నిరోధకత పెరిగి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు.

Similar News

News October 27, 2025

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి హౌసింగ్, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News October 27, 2025

ఆయుధాలపై విద్యార్థులకు ఎస్పీ అవగాహన

image

పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాధనాల పట్ల విద్యార్దులు అవగాహన కల్గి ఉండటం మంచిదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా డీపీఓలో ఏర్పాటుచేసిన పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి ఎస్పీ పరిశీలించారు. పోలీసు అమర వీరులను ప్రతి ఒక్కరం స్మరించుకుందాం అన్నారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందించామన్నారు.

News October 27, 2025

‘మొంథా’ తుఫాను: ‘అధికారులు అప్రమత్తంగా ఉండాలి’

image

‘మొంథా’ తుపాను నేపథ్యంలో కర్నూలు జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. తుఫాను సంసిద్ధతపై సోమవారం అధికారులతో కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాతో పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు అవసరమైనప్పుడు వివిధ శాఖలకు సంబంధించిన మానవ వనరులు (మెన్), సామగ్రి (మెటీరియల్) పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.