News March 21, 2025

నంద్యాల: ఫరూక్ సతీమణి చివరి కోరిక.. HYDలోనే అంత్యక్రియలు

image

మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షెహనాజ్(69) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె తన అంత్యక్రియలను ఎక్కడ నిర్వహించాలో ముందుగానే నిర్ణయించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లోని ఆగాపుర, పాన్‌మండి ఖబరస్తాన్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మంత్రి ఫరూక్ సతీమణి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Similar News

News December 1, 2025

కేరళ సీఎంకు ED నోటీసులు

image

2019 మసాలా బాండ్ల జారీ కేసులో కేరళ సీఎం పినరయి విజయన్‌కు ED నోటీసులు జారీ చేసింది. సీఎంతోపాటు ఆయన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎం అబ్రహం, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఇస్సాక్‌కు నోటీసులిచ్చింది. రూ.468 కోట్ల ట్రాన్సాక్షన్స్‌లో ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఉల్లంఘించారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమీకరించే ప్లాన్‌లో భాగంగా ఈ బాండ్లను జారీ చేశారు.

News December 1, 2025

హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,744 మందికిపైగా ఎయిడ్స్.!

image

ఎయిడ్స్ వచ్చిన సరే సాధారణ జీవితం గడపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గత 5ఏళ్లలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,744 మందికిపైగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడినవారు ఉన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సమాజం ఈ లెక్కలు చెబుతోంది. వీటితోపాటు నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాంటీరెట్రోవైరల్ థెరపీ ద్వారా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కాగా, నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం.

News December 1, 2025

ఎయిడ్స్‌పై జాగ్రత్తే కవచం: మంత్రి దామోదర్

image

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి దామోదర్ రాజనరసింహ పిలుపునిచ్చారు. ఎయిడ్స్‌పై అపోహలు వీడి, అవగాహన పెంపొందించాలని, సమయానికి పరీక్షలు, సురక్షిత జీవనశైలి మాత్రమే రక్షణ మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గోప్యతతో ఉచిత చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. వివక్షకు చోటు లేకుండా ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మంత్రి ఆకాంక్షించారు.