News April 11, 2025
నంద్యాల: ఫలితాలు రాకముందే.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.!

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరుకి చెందిన బిజ్జం సుధీశ్వర్ రెడ్డి (18) శుక్రవారం ఉరి వేసుకొని మృతి చెందినట్లు SI జగన్ తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశాడని, రేపు ఇంటర్ ఫలితాలు రానున్నందున ఫెయిల్ అవుతాననే భయంతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే.. దీనికి ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులను ఒంటరివాళ్లను చేయకండి.
Similar News
News April 10, 2026
చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించండి: కలెక్టర్

కర్నూలు నగర శివారులోని గార్గేయపురం డంపింగ్ యార్డ్‌ను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సందర్శించారు. నగర కమిషనర్ విశ్వనాథ్, ఆర్డీవోతో కలిసి చెత్తను శాస్త్రీయ విధానంలో డీకంపోజ్ చేసే ప్రక్రియను పరిశీలించారు. యార్డ్‌లో అమలవుతున్న నిర్వహణ పద్ధతులను అధికారులతో సమీక్షించారు. మరింత మెరుగైన చర్యలు చేపట్టాలని సూచించారు. చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు.
News April 9, 2026
పోషణ పక్వాడ కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్ సిరి

కర్నూలు జిల్లాలో ఈనెల 9 నుంచి 23 వరకు జరగనున్న పోషణ పక్వాడ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పోషణ పక్వాడ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. 2 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్, టీవీ స్క్రీన్‌లను పూర్తిగా దూరం పెట్టాలని సూచించారు. జంక్ ఫుడ్స్‌కు బదులుగా పప్పులు, పల్లీలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.
News April 9, 2026
పాత వాహనాల కొనుగోలులో జాగ్రత్తలు: ఎస్పీ

పాత వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. తక్కువ ధరకు వస్తున్నాయని రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలు కొనవద్దని హెచ్చరించారు. వాహనం కొనుగోలు ముందు ఆర్సీ, ఇన్సూరెన్స్, పీయూసీ వివరాలు RTA వెబ్‌సైట్‌లో చెక్ చేయాలని సూచించారు. చాసిస్, ఇంజిన్ నంబర్లు ఆర్సీతో సరిపోల్చాలన్నారు. విక్రేత అసలు యజమానా, కాదో నిర్ధారించుకోవాలన్నారు.


