News April 13, 2025
నంద్యాల: బాదంపప్పుపై ఆంజనేయ స్వామి చిత్రం

నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ హనుమాన్ జయంతి సందర్భంగా.. బాదంపప్పుపై ఆంజనేయస్వామి చిత్రాన్ని చిత్రీకరించాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాదంపప్పుపై హనుమంతుడు చిత్రాన్ని చిత్రీకరించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మోసుకు వస్తున్న రూపంలో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, వారి ప్రతిభను ప్రముఖులు ప్రత్యేకంగా కొనియాడారు.
Similar News
News April 17, 2025
భూ భారతిలో రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు: మంత్రి

TG: భూ భారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణపేట(D) మద్దూరులో భూ భారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘ధరణిలో డబ్బులు కట్టాల్సి వచ్చేది. భూ భారతిలో రూపాయి కూడా చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. గత ప్రభుత్వం పేదల భూములను కొల్లగొట్టింది. ఆడిట్ చేసి ఆ భూములను అర్హులైన పేదలకు ఇస్తాం’ అని పేర్కొన్నారు.
News April 17, 2025
వేములవాడ: రాజన్న ఆలయ విస్తీర్ణ పనుల కోసం సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ చేరుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తీర్ణ పనుల కోసం ఆలయ గెస్ట్ హౌస్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వేములవాడకు చేరుకున్న శైలజ రామయ్యకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వాగతం పలికారు.
News April 17, 2025
WEF జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జాబితాలో చోటు సంపాదించుకున్నారు. దాదాపు 50కి పైగా దేశాలకు చెందిన 116మందికి యంగ్ గ్లోబల్ లీడర్స్‌గా WEF చోటు కల్పించింది. భారత్ నుంచి మెుత్తంగా ఏడుగురు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన 40 సంవత్సరాలలోపు వ్యక్తులను యంగ్ గ్లోబల్ లీడర్స్‌గా WEF గుర్తిస్తుంది.