News April 13, 2025

నంద్యాల: బాదంపప్పుపై ఆంజనేయ స్వామి చిత్రం

image

నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ హనుమాన్ జయంతి సందర్భంగా.. బాదంపప్పుపై ఆంజనేయస్వామి చిత్రాన్ని చిత్రీకరించాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాదంపప్పుపై హనుమంతుడు చిత్రాన్ని చిత్రీకరించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మోసుకు వస్తున్న రూపంలో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, వారి ప్రతిభను ప్రముఖులు ప్రత్యేకంగా కొనియాడారు.

Similar News

News April 16, 2026

టీడీపీ పదవుల్లో ‘పశ్చిమ’కు పెద్దపీట

image

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పోలిట్‌బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్‌లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్‌కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

News April 16, 2026

ORR అలైన్‌మెంట్‌పై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

image

AP: అమరావతి ORR నిర్మాణానికి సంబంధించి విజయవాడ ఆగ్నేయ, ఈశాన్య పరిధిలోని అలైన్‌మెంట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన PILపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ORR నిర్మాణం ఎక్కడ జరగాలో పిటిషనర్ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. నిపుణుల బృందం ఖరారు చేసిన అలైన్‌మెంట్లలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.

News April 16, 2026

WGL: నామినేటెడ్ పదవులపై మహిళా నేతల ఆశలు!

image

కాంగ్రెస్ నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. గతేడాది నుంచి ఊరిస్తున్న ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీకి పీసీసీ నుంచి జిల్లా నేతలకు పేర్లు పంపాలంటూ ఫోన్లు వచ్చాయి. ఉమ్మడి జిల్లా నుంచి 10 మంది మహిళా నేతల పేర్లను TPCCకి పంపించారు. వీరందరికీ రాష్ట్ర స్థాయి ఛైర్‌పర్సన్ల పోస్టులు రానున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఇంటెలిజెన్సు నుంచి వారి ప్రవర్తనపై రిపోర్టులను సైతం ప్రభుత్వానికి పంపించారు.