News June 13, 2024
నంద్యాల: బాలికపై చిరుత పులి దాడి
నంద్యాల- గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులోని చలమ వద్ద 12 ఏళ్ల బాలిక పాండేపై చిరుతపులి దాడి చేసిన ఘటన గురువారం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీల కుటుంబాలు, రైల్వే పనులు చేస్తుండగా ఒక్కసారిగా చిరుత బాలికపై దాడి చేసిందని సాటి కూలీలు తెలిపారు. వారందరూ కేకలు వేయడంతో చిరుత పులి అక్కడనుంచి పారిపోయిందన్నారు. గాయపడిన బాలికను రైల్వే అధికారులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News September 17, 2024
గోనెగండ్ల వద్ద విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
కర్నూలు జల్లా గోనెగండ్ల మండలంలోని బైలుప్పల గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చాకలి తిక్కన్న (35) అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జరిగింది. తిక్కన్న ఇంటి సమీపంలోని మేకల షెడ్డులో విద్యుత్ వైర్లను సరి చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు తిక్కన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 17, 2024
రాష్ట్రస్థాయి యోగా పోటీలలో కర్నూలు జిల్లా జట్టుకు మూడో స్థానం
ఈనెల 14-15వ తేదీ వరకు భీమిలిలో జరిగిన 49వ రాష్ట్రస్థాయి యోగా పోటీలలో 149 పాయింట్లతో కర్నూలు జిల్లా జట్టు మూడో స్థానం సాధించినట్లు రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్ శెట్టి తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులు అక్టోబర్ 24-27వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే 49వ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు.
News September 16, 2024
కర్నూలు: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య UPDATE
కోసిగి గ్రామానికి చెందిన బలకుందు కోసిగయ్య(52) సోమవారం మధ్యాహ్నం కోసిగి నుంచి ఐరనగల్ 523/40-42 కిలోమీటర్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కోసిగయ్య తాగుడుకు బానిసై, కుటుంబ కలహాలతో గూడ్స్ రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మొండెం నుంచి తల తెగిపడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదోని రైల్వే పోలీసులు తెలిపారు.