News October 28, 2024
నంద్యాల: బాలుడి ప్రాణం తీసిన చికెన్ ముక్క

చికెన్ ముక్క తిని రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా సుగాలి తండాకు చెందిన కృష్ణయ్య, మణి దంపతులు రాజంపేటలోని మన్నూరు సాతవీధిలో కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం వారు చికెన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అనంతరం పనుల్లో నిమగ్నమవ్వగా బాలుడు సుశాంక్(2) చికెన్ ముక్క మింగాడు. తర్వాత ఊపిరాడక మృతి చెందాడు.
Similar News
News November 21, 2025
PMAY-G పేరు నమోదు చేసుకోండి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (PMAY-G 2.0) కింద గృహాల కోసం లబ్ధిదారుల పేర్ల నమోదు చేసుకోవాలని కర్నూలు కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామ/వార్డు సచివాలయంలో పేర్ల నమోదుకు ఈ నెల 30లోపు పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 20, 2025
పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకూడదు: కలెక్టర్

గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలోని మంజీత్ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ & ప్రెసింగ్ యూనిట్లో సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఏ.సిరి పరిశీలించారు. రైతులతో మాట్లాడిన ఆమె.. పత్తి సేకరణ, కొలతలు, రేట్లపై సమాచారం తీసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సకాలంలో చెల్లింపులు చేయాలని సీసీఐ అధికారులను ఆదేశించారు.
News November 20, 2025
పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సహకంపై దృష్టి పెట్టండి: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహంపై దృష్టి సాధించాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించారు. పరిశ్రమల విస్తరణ, ఎగుమతుల పెంపు, స్థానిక ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించే చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఎగుమతుల అవకాశాలు గుర్తించి సమస్యను పరిష్కరించాలని సూచించారు.


