News June 5, 2024

నంద్యాల: బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి?

image

ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక నేత TDP నేతగా బీసీ జనార్దన్ రెడ్డి పేరొందారు. 2014-19 వరకు అప్పటి TDP ప్రభుత్వంలో ఆయన తొలిసారి బనగానపల్లె MLAగా గెలుపొందారు. 2019లో ఓటమిని చవిచూసిన ఆయన.. 2024లో అదే స్థానం నుంచి మరోసారి MLAగా గెలిచారు. దీంతో ఈసారి CM చంద్రబాబు కేబినెట్‌లో బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని TDP శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Similar News

News December 22, 2025

ఫిర్యాదులపై చట్టపర చర్యలు: కర్నలు SP

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 84 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. మోసాలు, భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, దాడులు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు.

News December 22, 2025

కర్నూలు: విద్యుత్ సమస్యల పరిష్కారంపై అవగాహణ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించేందుకు APSPDCL ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం గ్రామాలు, పట్టణ వార్డుల్లో విద్యుత్ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ SE ప్రదీప్ కుమార్ ఉన్నారు.

News December 22, 2025

సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి: కర్నూలు కలెక్టర్

image

ప్రజల సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ న్యూరల్ కామర్‌తో కలిసి పీజీఆర్ఎస్ ద్వారా వినతి పత్రాలను స్వీకరించారు. ప్రతి సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల విభాగం (పీజీఆర్ఎస్) జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.