News April 30, 2024
నంద్యాల: బ్యాంక్ అకౌంట్ ద్వారా ఫించన్ల పంపిణీ
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫించన్ లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా నగదు జమవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన లబ్ధిదారులకు డోర్ టు డోర్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతులు, మంచానికే పరిమితమైన వారు, అస్వస్థతతో ఉన్నవారు, వృద్ధ మహిళలకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే అందిస్తారని చెప్పారు.
Similar News
News November 14, 2024
వెలుగోడులో యువతి ఆత్మహత్య
నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణం ఎస్సీ కాలానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై విష్ణు నారాయణ వివరాల మేరకు.. తల్లిదండ్రులు బయటకి వెళ్లిన సమయంలో 19 ఏళ్ల యువతి ఇంట్లో ఉరేసుకుంది. బంధువుల ఇంటికెళ్లి తిరిగొచ్చిన తల్లిదండ్రులు కూతురి బలవన్మరణాన్ని గమనించి బోరున విలపించారు. అయితే ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
News November 14, 2024
KNL: బాలికపై అత్యాచారయత్నం.. వైసీపీ సర్పంచ్ అరెస్ట్!
కర్నూలు జిల్లా కోసగి మండలంలో 13ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ వైసీపీ నేత, సర్పంచ్ హుసేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు కార్యకర్తలు వినోద్, సూరిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై చంద్రమోహన్ చెప్పారు. వారిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వివరించారు. అత్యాచారయత్నం అనంతరం పరారీలో ఉన్న నిందితులను కోసిగి గ్రామ శివారులో అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 14, 2024
ఓంకారం: ఆకలి తీర్చేందుకు వెళ్లి అనంత లోకాలకు
ఓంకారం వద్ద ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు భక్తుల ఆకలి తీర్చేందుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏ కోడూరుకు చెందిన మాజీ సర్పంచ్ చెన్నారెడ్డి, బండిఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అన్నదానం నిమిత్తం బియ్యం, సామాగ్రిని ఆలయం వద్ద దించి వస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఇద్దరు మృతి చెందగా, చిన్నన్న, శేషన్న గాయపడ్డారని ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు.