News November 29, 2024
నంద్యాల: భర్తను చంపిన కేసులో భార్య మరో ఇద్దరి అరెస్ట్
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామంలో భర్తను చంపిన కేసులో భార్య రమాదేవి, ఆమె ప్రియుడు వేణుగోపాల్, సహకరించిన వడ్డే నారాయణస్వామిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. మృతుడు రమేశ్ భార్య రమాదేవి వేణుగోపాల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని పేర్కొన్నారు. భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఈ నెల 26న నిద్రపోతున్న రమేశ్ ముఖంపై దిండు పెట్టి అదిమి హత్య చేశారని వివరించారు.
Similar News
News December 5, 2024
బేతంచర్లలో అల్లు ఫ్యాన్స్ భారీ హంగామా
జిల్లాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ కొనసాగుతోంది. ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అల్లు అర్జున్ కటౌట్స్‌కి పాలాభిషేకాలు, పూలమాలలు వేస్తూ డప్పులు, వాయిద్యాలతో రచ్చ చేస్తున్నారు. బేతంచర్లలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ ఏకంగా పొట్టేలు బలి ఇచ్చారు. ఆ రక్తంతో అభిషేకం చేశారు. భారీ నిమ్మకాయల దండ, అల్లు అర్జున్ కటౌట్స్‌తో పట్టణ వీధుల్లో తిరిగారు.
News December 5, 2024
అల్లు అర్జున్‌తో శిల్పా రవి
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి బుధవారం రాత్రి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ‘పుష్ప-2’ ప్రీమియర్ షోను వీక్షించి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో దిగిన ఫొటోను శిల్పా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనికి పుష్ప-2 వైల్డ్ ఫైర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
News December 5, 2024
కర్నూలులో 4 మి.మీ వర్షపాతం
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కర్నూలు జిల్లాలో నిన్న వర్షాలు కొనసాగాయి. 11 మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా కర్నూలులో 4 మి.మీ, అత్యల్పంగా మంత్రాలయంలో 1 మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.