News February 22, 2025
నంద్యాల: భూ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వీడాలి- ఆర్డీఓ

ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యల పరిష్కారం పై నిర్లక్ష్యం వీడి పనిచేయాలని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ హెచ్చరించారు. శనివారం ఉయ్యాలవాడ మండల తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలతో సమావేశం అయ్యారు. ప్రతి ఒక్కరు జీపీఎస్, రీ సర్వే సమస్యలను పరిష్కరించాలాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు . తహశీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ తహశీల్దార్ ప్రసాద్ బాబు, ఆర్ఐ అంకన్న ఉన్నారు.
Similar News
News November 28, 2025
కేజీహెచ్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రారంభం

కేజీహెచ్‌లోని గైనిక్ వార్డులో బాలింతల కోసం బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రాజెక్ట్‌ను ఆయుష్మాన్‌లో భాగంగా ఏర్పాటు చేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి ఈ యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్‌తో పిల్లల తల్లులకు అన్ని రకాల ఉపయోగాలు చేకూరుతాయని సూపరింటెండెంట్ వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వైద్యులు, సిబ్బంది, నిర్వాహకులు పాల్గొన్నారు.
News November 28, 2025
గంగాధర: రూపాయి బిళ్లలతో సర్పంచ్ నామినేషన్

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన జంగిలి మహేందర్ అనే యువకుడు వినూత్నంగా రూపాయి బిళ్లలతో నామినేషన్ వేశారు. గత ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా పోటీ చేసిన మహేందర్.. ఒక్క ఓటుతో ఓటమి చెందారు. దీంతో ఒక్క ఓటు విలువ తెలియడంతో ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా వెయ్యి రూపాయి బిళ్లలతో నామినేషన్ వేసినట్లు మహేందర్ చెప్పారు.
News November 28, 2025
MHBD: భూమి పేరు మార్పిడికి లంచం డిమాండ్

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తహశీల్దార్ మహేందర్ <<18414245>>లంచం<<>> తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. పోచంపల్లి పడమటి తండాకు చెందిన రైతు భూక్య బాలు తండ్రి పేరిట ఉన్న 3.09 గుంటల వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చడానికి తహశీల్దార్ రూ.25 వేలు డిమాండ్ చేయగా, రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.


