News February 22, 2025

నంద్యాల: భూ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వీడాలి- ఆర్డీఓ

image

ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యల పరిష్కారం పై నిర్లక్ష్యం వీడి పనిచేయాలని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ హెచ్చరించారు. శనివారం ఉయ్యాలవాడ మండల తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలతో సమావేశం అయ్యారు. ప్రతి ఒక్కరు జీపీఎస్, రీ సర్వే సమస్యలను పరిష్కరించాలాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు . తహశీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ తహశీల్దార్ ప్రసాద్ బాబు, ఆర్‌ఐ అంకన్న ఉన్నారు.

Similar News

News March 24, 2025

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు: ఏసర్ ఇండియా

image

తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో ఓ పెయిడ్ లీవ్ ఇవ్వనున్నట్లు ఏసర్ ఇండియా వెల్లడించింది. మాతృక పేరిట ప్రతి నెలా ఈ సెలవును అందిస్తామని తెలిపింది. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. L&T, స్విగ్గీ, జొమాటో కూడా ఈ తరహా లీవ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. బిహార్, ఒడిశా, సిక్కిం, కేరళ ప్రభుత్వాలు సైతం ఈ సెలవును అమలు చేస్తున్నాయి.

News March 24, 2025

బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తోటపల్లిగూడూరు వాసి

image

బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోటపల్లిగూడూరుకు చెందిన జానకి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడ బీఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అలాగే కార్యక్రమంలో జానకి ప్రసాద్‌కు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తి రుపతి, చిత్తూరు జిల్లాల ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. పార్టీ అభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తించినందుకు ఆయన పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

News March 24, 2025

తాడేపల్లిలో పామర్రు మహిళ దారుణ హత్య

image

ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లి కొలనుకొండ వద్ద ఆదివారం రాత్రి నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసినదే. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన సజ్జా లక్ష్మీ తిరుపతమ్మగా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ భారమై క్యాటరింగ్ పనులకు వెళ్తోంది. లక్షీ తిరుపతమ్మ ఆదివారం విజయవాడలో క్యాటరింగ్ పనికి వెళ్తున్న క్రమంలో హత్యకు గురైంది.

error: Content is protected !!