News April 10, 2025

నంద్యాల: మత్తు పదార్థాలను నియంత్రించాలి 

image

నంద్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు సహకరించి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో కోఆర్డినేషన్ కమిటీతో నిర్వహించిన సమావేశంలో అధికారులకు సూచనలు చేశారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నియంత్రణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొందని చెప్పారు. 

Similar News

News April 14, 2026

ఆలేరు: పాన్ మసాలా చోరీ కేసును ఛేదించిన పోలీసులు

image

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తరలుతున్న రూ.కోటి విలువైన ‘ఓ పాన్ మసాలా’ లోడుతో అదృశ్యమైన కంటైనర్ కేసును ఆలేరు పోలీసులు ఛేదించారు. ఏప్రిల్ మొదటి వారంలో కంటైనర్ అదృశ్యంపై ఢిల్లీకి చెందిన వినోద్ ఉపాధ్యాయ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ యాలాద్రి తెలిపారు. సాంకేతిక ఆధారాలతో వేగంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

News April 14, 2026

చమురు భగభగతో భారత్‌ జీడీపీకి ఎఫెక్ట్: S&P

image

చమురు ధరల భగభగ నేపథ్యంలో మరో ఏజెన్సీ భారత్ GDP గ్రోత్‌పై తన అంచనాలు ప్రకటించింది. ఈ ఏడాది బ్యారెల్ ధర సగటున 130 డాలర్లుగా కొనసాగితే FY27లో గ్రోత్ 0.8% తగ్గొచ్చని S&P గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. FY27లో భారత్ జీడీపీ గ్రోత్ 7.1% ఉండొచ్చని గత నెల అంచనా వేసింది. ఇటీవల మోర్గాన్ స్టాన్లీ <<19592068>>సంస్థ<<>> కూడా మూడు నెలల పాటు చమురు ధర $150 వద్ద కొనసాగితే గ్రోత్ రేట్ 5.7%కే పరిమితమవుతుందని పేర్కొంది.

News April 14, 2026

NRPT: రహదారి భధ్రతపై ప్రతిజ్ఞ

image

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నారాయణపేట అంబేడ్కర్ కూడలిలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎస్పీ డాక్టర్ వినీత్, రాజకీయ పార్టీల నేతలు, దళిత సంఘాల నేతలు, ప్రజలు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు.