News June 23, 2024

నంద్యాల : మహిళపై చిరుత పులి దాడి..?

image

తనపై చిరుత పులి దాడి చేసిందని శనివారం ఓ మహిళ ఆరోపించారు. నంద్యాలలోని పచ్చర్ల గ్రామంలో షేక్ బీబీ అనే మహిళ తన ఇంట్లో నిద్రిస్తుండగా, చిరుత పులి అకస్మాత్తుగా వచ్చి తల భాగంపై దాడి చేసిందని, ఆమె కేకలు వేయడంతో సమీపంలోని అడవి ప్రాంతంలోకి పారిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 6, 2025

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2025కు సిద్ధం కావాలి: చీఫ్ ఎలక్టోరల్ అధికారి

image

కర్నూల్ జిల్లాలో ఓటర్ల జాబితా లోపరహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డా.ఏ.సిరి, అధికారులు పాల్గొన్నారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్‌లుగా నమోదు చేయాలన్నారు. డూప్లికెట్, చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

News November 5, 2025

ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు

image

ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాత్రి పూట నడిచే ప్రైవేట్, ఆర్టీసీ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, భద్రతా పరికరాలు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News November 5, 2025

ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

image

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. బుధవారం సాయంత్రం మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో అన్ని వైద్య విభాగాల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది నియామకాలు, వసతుల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి టీజీ భరత్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.