News November 22, 2024
నంద్యాల: మహిళా MLAల గ్రూప్ SELFIE
అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 11న ప్రారంభమై ఇవాళ నిరవధిక వాయిదా పడ్డాయి. కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదినం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా MLAలు కేక్ కట్ చేసి ప్రశాంతిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల అనంతరం హోంమంత్రి అనిత అందరినీ తన ఫోన్‌తో సెల్ఫీ తీశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మన MLAలు భూమా అఖిలప్రియ, గౌరు చరితా పాల్గొన్నారు.
Similar News
News December 14, 2024
టామాటా కిలో కనిష్ఠ ధర రూ.4కు కొనుగోలు చేయండి: జేసీ
పత్తికొండ టమోటా మార్కెట్‌లో రైతుల నుంచి టమోటా కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకు 42 ఉత్పత్తులు వచ్చాయని, ఇందులో 13 టన్నులు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసి రాష్ట్రంలోని వివిధ రైతు బజార్లకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. టమోటా కిలో కనిష్ఠ ధర రూ.4 లకు కొనుగోలు చేయాలని ఆదేశించారు.
News December 13, 2024
బనగానపల్లె జాబ్ మేళాలో 1000 మందికి ఉద్యోగాలు
బనగానపల్లె నెహ్రూ పాఠశాలలో గురువారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. మంత్రి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు. 30కి పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొనగా.. 1000 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించాయి. ఎంపికైన అభ్యర్థులకు ఇందిరా రెడ్డి ఆఫర్ లెటర్లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
News December 13, 2024
పత్తికొండలో కిలో టమాటా రూ.1
పత్తికొండ నుంచి టమాటా ఎగుమతులకు డిమాండ్ తగ్గడంతో ధరలు భారీగా పడిపయాయి. ఇతర ప్రాంతాల్లో నాణ్యతను బట్టి కిలో రూ.20కిపైగా అమ్ముడుపోతుండగా ఇక్కడ మాత్రం కిలో ₹1 నుంచి ₹8 వరకు పలకడం విశేషం. పత్తికొండ మార్కెట్‌కు వచ్చే టమాటాను తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలకు తరలిస్తారు. ఆయా చోట్ల స్థానిక దిగుబడి పెరగడంతో పత్తికొండ మార్కెట్‌పై ఎఫెక్ట్ పడింది. దిగుబడులను రైతులు రోడ్ల పక్కన పారబోస్తున్నారు.