News January 30, 2025
నంద్యాల: ‘మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు’

నంద్యాల జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మాదకద్రవ్యాల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News October 14, 2025
HYD: చీటీలు వేస్తున్నారా.. జర జాగ్రత్త..!

మాంగళ్య షాపింగ్ మాల్లో పనిచేస్తూ తోటి ఉద్యోగులను చీటీల పేరిట మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. HYD బోరబండ హబీబ్ ఫాతిమా నగర్కు చెందిన బజ్జూరి రాంచందర్(47) హయత్నగర్ మునుగనూరులో ఉంటున్నాడు. 20 మందిని చీటీల పేరిట, ఇతరుల క్రెడిట్ కార్డ్స్తో రూ.30 లక్షలు వాడుకున్నాడు. పని మానేసి ఇల్లు ఖాళీ చేశాడు. బాధితుడు బుక్కి బాలకృష్ణ ఫిర్యాదుతో అరెస్ట్ చేశామని సీఐ మహేశ్ తెలిపారు.
News October 14, 2025
చిత్తూరు: అసిస్టెంట్ సర్వేయర్ కోర్సుకు దరఖాస్తులు

అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు చేసేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు.APPSDC స్కిల్ హబ్ ఆధ్వర్యంలో ఉచిత అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కోర్సుకు 5 నుంచి ఏదైన ఉన్నత విద్యవరకు చదివిన వారు అర్హులన్నారు. ఈనెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 14, 2025
చిత్తూరు: 17న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్

ఈనెల 17న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలియజేశారు. జిల్లాలోని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల విద్యార్థులు మాత్రమే ఈ సెమినార్ పోటీలకు అర్హులన్నారు. క్వాంటం యుగం ప్రారంభం-అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 17న ఉ.10 గంటలకు జిల్లా కేంద్రం లోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సెమినార్ పోటీలు నిర్వహిస్తారని తెలిపారు.