News January 30, 2025
నంద్యాల: ‘మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు’

నంద్యాల జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మాదకద్రవ్యాల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News February 10, 2025
భద్రాద్రి: సర్పంచ్ ఎన్నికలు.. అదనపు కలెక్టర్ సూచన

గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఆమోదం, అభ్యంతరాల స్వీకరణపై భద్రాద్రి జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన అధ్యక్షతన ఐడీఓసీ కార్యాలయ సమావేశం మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా చందన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. అధికారులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు.
News February 10, 2025
స్థానిక ఎన్నికలు.. గద్వాల జిల్లా పూర్తి వివరాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లా అధికారులు, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన గద్వాల జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు, 4 మున్సిపాలిటీలు,13 మండలాలు ఉన్నాయి. ఎర్రవల్లి కొత్త మండలం ఏర్పాటుతో ZPTC, MPP పదవులు, ఒక MPTC స్థానం పెరగనున్నాయి. ప్రస్తుతం జడ్పీటీసీ-13, ఎంపీపీ-13 ఎంపీటీసీ-141, గ్రామ పంచాయతీలు 255 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
News February 10, 2025
విశాఖ: ముగిసిన నామినేషన్ల గడువు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు నేటితో ముగిసిందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఇప్పటి వరకు మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే వీరి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ 11న, ఉప సంహరణ 13న ఉంటుంది. పరిశీలన, ఉపసంహరణ పూర్తయిన తర్వాత బరిలో ఎంత మంది నిలుస్తారన్నది తేలనుంది.