News June 12, 2024
నంద్యాల: రెడ్డి సామాజికవర్గం నుంచి బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి

చంద్రబాబుకు విధేయుడిగా ఉన్న బనగానపల్లె MLA బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుదక్కింది. ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వగా.. రెడ్డి సామాజికవర్గం నుంచి బీసీ జనార్దన్ రెడ్డికి అవకాశం దక్కింది. ఈయన 2014లో ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలిచారు. 2019లో ఓడిపోయినా పార్టీ కష్టకాలంలో అండగా నిలబడ్డారు. ఆయన విధేయతకు ఎన్నికలకు ముందు నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఇన్ఛార్జ్గా చంద్రబాబు నియమించారు.
Similar News
News November 16, 2025
అంగన్వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందించాలి: కలెక్టర్ సిరి

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహార లోపం లేకుండా చూడాలని సీడీపీఓలను కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. ఉదయం 9 గంటలకు కేంద్రాలు తెరచి, పిల్లల ఎత్తు, బరువు ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. తల్లులకు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, వాట్సాప్ గ్రూపుల ద్వారా పోషకాహారంపై వీడియోలు పంపాలని ఆమె సూచించారు.
News November 15, 2025
మైనర్ డ్రైవింగ్ తీవ్ర నేరం: కర్నూలు ఎస్పీ

మైనర్ డ్రైవింగ్ చట్ట ప్రకారం తీవ్ర నేరమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. 2025 జనవరి–అక్టోబర్ మధ్య జిల్లాలో 675 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను, యజమానులను ఆయన సూచించారు. రెండోసారి పట్టుబడితే ₹5,000 జరిమానా ఉంటుందని హెచ్చరించారు.
News November 15, 2025
బాల్య వివాహాలను నిర్మూలించండి: కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కర్నూలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వరకట్న నిషేధం, బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో వరకట్న నిషేధంపై అధికారులు స్వచ్ఛంద సంస్థల ద్వారా నిరంతరం అవగాహన కల్పించాలన్నారు.


