News January 4, 2025

నంద్యాల: రైలు కిందపడి వ్యక్తి సూసైడ్

image

నంద్యాల నుంచి దిగువ మెట్ట వెళ్లే మార్గంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు వెల్లడించారు. డోన్ నుంచి గుంటూరు వరకు వెళ్లే రైలులో ఓ వ్యక్తి ప్రయాణం చేశారని చెప్పారు. చలమ నుంచి దిగువమెట్ట వరకు ఉన్న రైలు మార్గంలో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు.

Similar News

News January 20, 2025

కొత్తపల్లి: బయల్పడుతున్న సంగమేశ్వరాలయం

image

కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సప్త నదుల సంఘం క్షేత్రంలోని సంగమేశ్వరాలయం నెమ్మదిగా బయలు పడుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 855.90 అడుగుల మేర నీటి నిల్వలు ఉండడంతో ఆలయం పది అడుగుల మేర బయల్పడింది. మరో 18 అడుగులు తగ్గినట్లయితే ఆలయం పూర్తిస్థాయిలో బయలు పడనుంది. జులై నెలలో నీటి మునిగిన సంగమేశ్వరుడు నెమ్మదిగా జలాధివాసం నుంచి విముక్తి పొందుతున్నారు.

News January 20, 2025

బేతంచెర్ల మండలంలో మహిళ ఆత్మహత్య

image

బేతంచెర్ల మండలం గొర్లగుట్ట గ్రామానికి చెందిన బోయ నాగలక్ష్మి(39) కడుపు నొప్పి తాళలేక పేడ రంగు నీళ్లు తాగి ఆత్మహత్య చేసుకుందని హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర గౌడ్ ఆదివారం తెలిపారు. కొంతకాలంగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉండేదని, వైద్యం చేయించినా నయం కాలేదన్నారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడ రంగు నీళ్లు తాగి ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News January 20, 2025

ఆత్మకూరు: డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా

image

ఫైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ సురేశ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాములపాడు గ్రామ శివారులోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, అసాంఘిక కార్యకలాపాలు, పేకాట వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్‌ కెమెరాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిని గుర్తించి, కేసులు నమోదు చేశామన్నాన్నారు.