News July 13, 2024
నంద్యాల: రైలు నుంచి కింద పడిన భార్య.. కాపాడే క్రమంలో భర్త మృతి

రైలు నుంచి కిందపడిన భార్యను కాపాడబోయి భర్త మృతిచెందిన ఘటన డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది. దంపతులు సయ్యద్ ఆసిఫ్, అసియాబాను ఫుట్బోర్డుపై కూర్చొని ప్రయాణిస్తుండగా నిద్రమత్తులో భార్య కిందపడింది. గమనించిన భర్త ఆమెను కాపాడేందుకు రైలు నుంచి దూకి మృతిచెందాడు. మహిళను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్ణాటకకు చెందిన వీరు.. 4 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 23, 2025
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కర్నూలుకు పతకాలు

ఈ నెల 15, 16వ తేదీల్లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కర్నూలు క్రీడాకారులు 2 బంగారు, ఒక రజితం, 10 కాంస్య పతకాలు సాధించినట్లు తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం కర్నూలు శరీన్ నగర్లోని వెంకటేష్ తైక్వాండో అకాడమీలో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జి.శ్రీనివాసులు అభినందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించాలన్నారు.
News November 23, 2025
సీమ అభివృద్ధికి సత్య సాయిబాబా కృషి: కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. వేడుకల్లో కర్నూలు ఎంపీ నాగరాజు, కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సత్య సాయిబాబా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు.
News November 23, 2025
అదే మా లక్ష్యం: కర్నూలు ఎస్పీ

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. హెల్మెట్ తప్పనిసరి, ఓవర్స్పీడ్–ఓవర్లోడ్ నిషేధం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని ప్రజలకు సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.


