News April 9, 2024
నంద్యాల: వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధి కూలీలు ఎండ తీవ్రత పట్ల జాగ్రత్తగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. ప్రధాన కూడళ్ళలో చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసరమైన ప్రదేశాలలో వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Similar News
News October 26, 2025
ఈనెల 27న పబ్లిక్ గ్రీవెన్స్: జిల్లా కలెక్టర్

ఈనెల 27న పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. (సోమవారం) ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం జరుగుతోందన్నారు. మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిల్లో కూడా ఇదే కార్యక్రమం ఉంటుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News October 25, 2025
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

నంద్యాల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి గణియా శనివారం పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో నంద్యాల జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు చెప్పారు. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయొద్దని, మొక్కజొన్న పంట కోతను వాయిదా వేసుకోవాలని, రైతులు పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. పురాతన మట్టి మిద్దెల కింద నివాసం ఉండొద్దని సూచించారు.
News October 25, 2025
పోలీసుల అదుపులో శివశంకర్ స్నేహితుడు

కర్నూలు బస్సు ప్రమాదంలో శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ప్రమాదానికి ముందు శివశంకర్ బైక్ ఎక్కారు. వీరిద్దరూ పెట్రోల్ బంకులో ఉన్న <<18098159>>CC వీడియో<<>> బయటకొచ్చింది. బస్సు-బైక్ ఢీకొన్న ఘటనలో శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరూ ఎగిరి పడినట్లు తెలుస్తోంది. ఘటనలో శివశంకర్ మృతిచెందగా ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డారు.


