News February 23, 2025
నంద్యాల: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం సాయంత్రం శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించి పోలీస్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. కేటాయించిన విధుల్లో బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
Similar News
News March 27, 2025
గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం వాయిదా

ఈనెల 29వ తేదీన గుంటూరులో జరగనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా బుధవారం తెలిపారు. 2025-26వ సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వ పథకాలను అదనంగా చేర్చ వలసి ఉన్నందున అదే విధంగా మెజార్టీ సభ్యులు కొంత సమయం కోరిన కారణంగా వాయిదా వేసినట్లు ఛైర్‌పర్సన్ తెలిపారు.
News March 27, 2025
కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లకు ఢిల్లీలో శిక్షణ

అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ ఆధ్వర్యంలో “నేతృత్వ సృజన్” పేరుతో మహిళా నాయకత్వ శిక్షణ తరగతులు న్యూఢిల్లీలో 2 రోజులపాటు జరిగాయి. ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లి శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, తదితరులు ఉన్నారు.
News March 27, 2025
కునాల్‌కు మద్దతుగా అభిమానులు..రూ. లక్షల్లో విరాళాలు

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు తన అభిమానుల నుంచి రూ.లక్షల్లో ఆర్థిక సాయం అందుతోంది. విదేశాల నుంచి ఒక అభిమాని రూ.37,000 పంపించిన ఫోటోని ఓ అభిమాని Xలో షేర్ చేశారు. యూట్యూబ్ ‘సూపర్ థాంక్స్’ ఫీచర్ ద్వారా విరాళాలు అందజేస్తున్నారు. కునాల్‌పై కేసు నమోదైన నేపథ్యంలో లీగల్ ఖర్చుల అవసర నిమిత్తం అభిమానులు డబ్బు పంపిస్తున్నారు. DY.cm ఏక్‌నాథ్ శిండేపై కామెడీ స్కిట్ చేసినందుకు కునాల్ పై కేసు నమోదైంది.