News July 3, 2024
నంద్యాల: విధుల్లో ఉండగానే టీచర్ మృతి

విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలి మంగళవారం మృతిచెందారు. ఆత్మకూరులో నివాసముంటున్న జీ.నాగలక్ష్మయ్య(58) కొత్తపల్లి మండలం కొత్తమాడుగుల ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. భోజన విరామ సమయంలో ఉన్నఫళంగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఉపాధ్యాయుడిని తోటి ఉపాధ్యాయులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News October 19, 2025
కర్నూలు: 9 నెలల్లో 6,858 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

కర్నూలు రేంజ్లో 9 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 6,858 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు. రహదారి భద్రతలో భాగంగా ప్రతి రోజు వాహన తనిఖీలు నిర్వహించి, డ్రైవర్లకు కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 13,555 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News October 19, 2025
లిక్కర్ షాపుల కోసం రూ.4.5 కోట్లు పెట్టిన కర్నూలు మహిళ

కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ తెలంగాణలోని 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసింది. ఇందుకోసం ఆమె రూ.4.5 కోట్లు చెల్లించింది. ఏపీకి సరిహద్దుల్లో ఉండే జిల్లాల్లోని షాపులకు ఈమె ఎక్కువగా దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఆమెకు ఏపీలోనూ ఎక్కువ దుకాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న డ్రా ద్వారా వైన్ షాపులకు లైసెన్స్ ఇవ్వనున్నారు.
News October 19, 2025
జిల్లా కలెక్టర్ డా.సిరి హెచ్చరిక.!

దీపావళి సందర్భంగా కేటాయించిన ప్రదేశాలలోనే టపాకాయలు విక్రయించాలని, నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షించాలని శనివారం కలెక్టర్ ఆర్డీవోలు, తహసీల్దార్లకు సూచించారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీపావళి సంతోషంగా జరుపుకోవాలని, బాణాసంచా కాల్చే సమయంలో ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.