News April 22, 2024
నంద్యాల: వివాహ వేడుకలో కారం చల్లి పెళ్లికూతురి ఆపహరణ

పెళ్లికూతురిని ఆహరణకు యత్నించిన ఘటన తూగో జిల్లా కడియం(M)లో జరిగింది. కడియం సీఐ వివరాలు..చాగలమర్రి(M) గొడిగనూరుకు చెందిన స్నేహ, కడియంకు చెందిన బత్తిన వెంకటనందు నరసరావుపేటలో ఓ కాలేజీలో చదివారు. ఈ క్రమంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వెంకటనందు తన ఇంట్లో చెప్పగా పెద్దలు అంగీకరించారు. ఆదివారం మరోసారి పెళ్లి చేస్తుండగా పెళ్లికుతూరు తరుఫువాళ్లు వచ్చి వారిపై కారం చల్లి స్నేహ అపహరణకు యత్నించారు.
Similar News
News April 21, 2025
ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీసులో ప్రజా గ్రీవెన్స్

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గ్రీవెన్స్ వచ్చిన ప్రజా సమస్యలను తెలుసుకొని వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, వేణు సూర్య, డిఎల్పిఓ నూర్జహాన్, డిఎల్డిఓ రమణ రెడ్డి పాల్గొన్నారు.
News April 21, 2025
ఆర్జీదారుల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్

ప్రజల నుంచి వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. అదోనిలోని సబ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్- పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్వీకరించారు. సమస్య ప్రాధాన్యతను బట్టి ఆయా శాఖల అధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు.
News April 21, 2025
ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ ద్వారా 2,645 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-1057 ➤ BC-A:187 ➤ BC-B:259
➤ BC-C:27 ➤ BC-D:186 ➤ BC-E:99
➤ SC- గ్రేడ్1:35 ➤ SC-గ్రేడ్2:173
➤ SC-గ్రేడ్3:204 ➤ ST:161 ➤ EWS:257.
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16156783>>ఇక్కడ క్లిక్<<>> చేయండి.