News January 7, 2025
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ నాయక్ అబ్దుల్ సత్తార్ సస్పెండ్ అయ్యారు. కోర్టు స్టే ఉన్న ఓ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ దర్యాప్తు జరిపారు. వాస్తవాలు గుర్తించి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ ఉన్నంత వరకూ హెడ్ క్వార్టర్స్ వదిలి బయటికి వెళ్లరాదని ఆదేశించారు.
Similar News
News January 22, 2025
వచ్చే నెల 19 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శివరాత్రి బ్రహ్మోత్సవాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరి సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని సమావేశంలో తీర్మానించారు.
News January 22, 2025
కర్నూలు: ముగ్గురు విద్యార్థుల మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, వాహన డ్రైవర్ మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ప్రమాద ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. విద్యార్థులు హంపిలో ఆరాధనకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.
News January 22, 2025
మంత్రాలయం విద్యార్థుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులు మృతి చెందడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.