News May 21, 2024

నంద్యాల: స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత

image

ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్స్ భద్రతలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం పాణ్యం మండలం నెరవాడ గ్రామ సమీపంలోని ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన ఈవీఎంల పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు.

Similar News

News December 4, 2024

పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు: కలెక్టర్

image

డిసెంబరు 7న జరిగే మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా విద్యా శాఖాధికారులను ఆదేశించారు. బుధవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం ఏర్పాట్లపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్వహణకు సంబంధించి 13 కమిటీలను ఏర్పాటు చేశారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు.

News December 4, 2024

CM రేవంత్ రెడ్డితో మంత్రి టీజీ భరత్ భేటీ

image

తెలంగాణ CM రేవంత్ రెడ్డిని మంత్రి టీజీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ‘స్ఫూర్తిదాయకమైన, కష్టంతో ఎదిగిన ఓ రాజకీయ నాయకుడిని కలవడం అదృష్టంగా భావిస్తున్నా. పట్టుదల, అంకితభావంతో కూడిన ప్రయాణం ఆయన శక్తికి నిదర్శనం. రేవంత్ రెడ్డి దూరదృష్టి, ఆయన నాయకత్వం నన్ను ఆకట్టుకుంటోంది. ప్రజలకు సేవ చేయడంలో, సానుకూల ప్రభావం చూపడంలో ఆయన విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ టీజీ భరత్ పోస్ట్ చేశారు.

News December 4, 2024

కర్నూలు జిల్లాలో భూప్రకంపనల ప్రభావం లేదు!

image

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూ ప్రకంపనల ప్రభావం కర్నూలు జిల్లాపై లేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఏడాది క్రితం జిల్లాలోని రాతన గ్రామం కురువ గేరిలో భూమి కంపించిన విషయం తెలిసిందే. దీని ప్రభావానికి అప్పట్లో 12ఇళ్లు బీటలు వారాయి.