News October 3, 2024
నంద్యాల హత్య కేసులో ముద్దాయి అరెస్టు

నంద్యాల గుడిపాటిగడ్డ వీధిలో గత నెల 30న దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సాయి మనోహర్‌ను హత్య చేసిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. తన భార్యతో అక్రమ సంబంధం ఉందని మనోహర్‌తో దుర్గా ప్రసాద్ గొడవ పెట్టుకొని కత్తితో దాడి చేశాడన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మరణించాడన్నారు. పరారీలో ఉన్న దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.
Similar News
News November 24, 2025
లింగ సమానత్వానికి కృషి చేయాలి: కర్నూలు కలెక్టర్

సమాజంలో లింగ సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “జెండర్ సమానత్వం” జాతీయ ప్రచార పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా “నయీ చేతన 4.0 –మార్పు కోసం ముందడుగు” పేరుతో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు.
News November 24, 2025
ఇళ్లు లేనివారు ఈనెల 30లోగా ఇలా చేయండి: కర్నూలు కలెక్టర్

PMAY–2 గ్రామీణ్ కింద అర్హతకలిగి, ఇల్లులేని గ్రామీణ ప్రజలు నవంబర్ 30లోపు తమపేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామాల్లో ఇంటి స్థలం ఉన్నా– లేకపోయినా సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు. ఇల్లు మంజూరు అయ్యేవారికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందజేస్తుందని పేర్కొన్నారు. గడువు తర్వాత నమోదు అవకాశంలేదని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News November 24, 2025
అర్జీలు స్వీకరించిన కర్నూలు కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ. సిరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.


