News April 3, 2025
నంద్యాల: హైవే పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పరిశీలించారు. బుధవారం హైవే నిర్మాణ పనుల వద్దకు వెళ్లిన వారు ఆయా గ్రామాల్లోని స్థానికులతో ప్రత్యేకంగా మాట్లాడారు. హైవే నిర్మాణాల్లో స్థానికుల సమస్యలు, ఇతర వివరాలపై స్థానిక ప్రజలతోపాటు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News April 25, 2025
NRML: ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్జాపూర్ గ్రామానికి చెందిన కదం ప్రకాశ్(41) మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటి తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News April 25, 2025
దహెగాం: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు: SI

దహెగాం మండలానికి పెసరకుంట గ్రామానికి చెందిన కామెర హొక్టుపై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై కందూరి రాజు తెలిపారు. 11 ఏళ్ల బాలిక ఇంటి వద్ద తన చెల్లిన ఆడిస్తుండగా.. హొక్టు వెళ్లి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 25, 2025
ఖమ్మం: భానుడి ప్రతాపం.. ఈ మండలాల్లోనే అధికం

ఖమ్మం జిల్లాలో గురువారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. మధిరలో 43.1, KMM(U) ఖానాపురం PS 42.9, కారేపల్లి, కామేపల్లి (లింగాల) 42.8, ముదిగొండ(పమ్మి), సత్తుపల్లి 42.7, రఘునాథపాలెం 42.6, పెనుబల్లి 42.5, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.0, కూసుమంచి 41.9, వైరా 41.8, వేంసూరు, కల్లూరు 41.6, ఎర్రుపాలెం 41.5, కొణిజర్ల, ఏన్కూరు 41.0, KMM (R) పల్లెగూడెంలో 40.3 డిగ్రీలు నమోదైంది.