News November 23, 2024

నంద్యాల: 143 మంది పోలీస్ సిబ్బంది బదిలీ

image

నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న 143 మంది పోలిస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత, బదిలీల కౌన్సెలింగ్‌లో సూచనలు చేశారు. జిల్లాలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News November 27, 2024

తుగ్గలి: భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త

image

తుగ్గలి మండలం రాంపల్లి గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. సరోజ (35) అనే మహిళను భర్త గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్యపై అనుమానంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. మృతురాలు సరోజకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తుగ్గలి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

News November 27, 2024

మంత్రి ఫరూక్‌ను సత్కరించిన న్యాయవాదులు

image

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను బుధవారం నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎన్నికల సెల్ విభాగం న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని గుర్తుచేశారు. ప్రత్యేకించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినందుకు కృషి చేస్తున్నారన్నారు.

News November 27, 2024

ఐపీఎల్‌లో మన కర్నూలు కుర్రాళ్లెక్కడ?

image

IPLకు ఉన్న క్రేజ్ వేరు. ప్రతి క్రికెటర్ ఆ టోర్నీలో ఆడాలని కల కంటారు. అలాంటి IPLలో కర్నూలు జిల్లా క్రీడాకారుల భాగస్వామ్యం లేదు. జిల్లాలో యువ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో నైపణ్యాలు లేకపోవడంతో వేలంలో పాల్గొనే అవకాశం కూడా దక్కలేదు. ఇప్పటికైనా జిల్లాలో టాలెంట్ ఉన్న ప్లేయర్లను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు జిల్లాకు చెందిన అంజలి, అనూష మహిళా క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు.