News April 12, 2024
నంద్యాల: 33 ఏళ్ల తర్వాత ఒక్కటైన ప్రత్యర్థులు.. గెలుపు ఖాయమేనా?

ప్రత్యర్థులు భూమా, ఇరిగెల కుటుంబాలు ఒక్కటయ్యాయి. 1992 ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో భూమా నాగిరెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి పోటీచేశారు. జమ్మలమడుగు MLA శివారెడ్డి, NMD ఫరూక్ మధ్యవర్తిత్వంతో ఇరిగెల కుటుంబం నాగిరెడ్డి విజయానికి కృషిచేసింది. ఆ 2 కుటుంబాల కలయితో గెలుపు నల్లేరుపై నడకగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఏకమవ్వడంతో అఖిలప్రియ గెలుపు సులభమేనని అంచనా వేస్తున్నారు.
Similar News
News January 17, 2026
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా మండల స్థాయిలో కార్యాచరణాత్మక వ్యవసాయ ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. ఈ-క్రాప్ బుకింగ్‌ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, వరికి బదులుగా మల్లెపూలు, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, అరటి వంటి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. పంట సేకరణ, మార్కెటింగ్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
News January 17, 2026
కర్నూలు: సంక్రాంతి నాడు విషాదాంతాలు

సంక్రాంతి పండుగ నాడు పలు కుటుంబాల్లో విషాదం మిగిలింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బైక్ ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. పాణ్యం(M) తమ్మరాజుపల్లెలో వాహనం ఢీకొని రత్నమ్మ(50) మరణించింది. బేతంచెర్ల(M) శంకలాపురం గ్రామానికి చెందిన దస్తగిరి(33) బొలెరో ఢీకొని చనిపోయాడు. అప్పుల బాధతో గోనెగండ్లలో కౌలు రైతు జైనుద్దీన్, ఆదోనికి చెందిన వెంకటేశ్(42), కర్నూలుకు చెందిన శివకుమార్(33) ఉరేసుకున్నారు.
News January 17, 2026
కర్నూలు: భార్యను వదిలేసిన టీచర్‌కు రిమాండ్!

DSC కోచింగ్‌లో పరిచయమైన యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకొని వదిలేసిన సంజామల(M) ఆకుమల్లకు చెందిన టీచర్ కలింగిరి మహేశ్‌ను కోవెలకుంట్ల కోర్టు 14రోజుల రిమాండ్‌కు పంపింది. కర్నూలు(D) సి.బెళగల్(M) కంబదహాల్‌కు చెందిన సారమ్మతో రెండేళ్లు సహజీవనం చేసి ఉద్యోగం రాగానే దూరం పెట్టాడు. యువతి ఒత్తిడితో ఎవరికీ తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెను వదిలేశాడు. దీంతో యువతి సంజామల పోలీసులను ఆశ్రయించింది.


