News March 17, 2025
నంద్యాల: ALERT.. మధ్యాహ్నం 12:30 వరకే

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నేడు “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి గణియా ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని ఉ.9:30 గం.లకు ప్రారంభించి మ.12:30 గం.లకు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News November 18, 2025
గిల్ స్థానంలో గైక్వాడే కరెక్ట్: ఆకాశ్ చోప్రా

గిల్ SAతో రెండో టెస్టు ఆడతారా, లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఆడకపోతే అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ని తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. ‘గిల్ స్థానంలో ఆడేందుకు సాయి సుదర్శన్, పడిక్కల్ ఉన్నారు. కానీ వారిలో ఎవరిని తీసుకున్నా జట్టులో ఏడుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లవుతారు. అది మంచిది కాదు. రుతురాజ్ డొమెస్టిక్గా బాగా రాణిస్తున్నారు. అతనే కరెక్ట్ అనిపిస్తోంది’ అని తెలిపారు.
News November 18, 2025
ఆదిలాబాద్లో రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు

బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తలపెట్టిన బంద్ను విరమించుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ, ప్రైవేటు ద్వారా పత్తి కొనుగోళ్లు యథావిధిగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని సూచించారు.
News November 18, 2025
ADB: ఈ నెల 20న వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 20న వేడుకలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జిల్లాలోని వయోవృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. డీఎంహెచ్ఓ, రిమ్స్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉదయం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


