News March 17, 2025

నంద్యాల: ALERT.. మధ్యాహ్నం 12:30 వరకే

image

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నేడు “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి గణియా ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని ఉ.9:30 గం.లకు ప్రారంభించి మ.12:30 గం.లకు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News April 24, 2025

గన్ ఎక్కుపెట్టిన తిరుపతి కలెక్టర్

image

తిరుపతిలోని శ్రీనివాస క్రీడా మైదానంలో మంత్రి మండిపల్లితో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్ పలు క్రీడా వేదికలను బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకే స్పోర్ట్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ గన్ చేతపట్టి గురిపై ఎక్కుపెట్టారు.

News April 24, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మూడురోజుల పాటు RED ALERT

image

KNR, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజులపాటు తీవ్ర వడగాలులతోపాటు ఉక్కపోత ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు సూచన చేస్తున్నారు. మే నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

News April 24, 2025

జగిత్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

image

జగిత్యాల జిల్లాలో బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండపల్లి మండలంలో 44.9℃, వెల్గటూర్ 44.8, గొల్లపల్లి 44.8, మల్లాపూర్ 44.8, బీర్‌పూర్ 44.7, బుగ్గారం 44.7, ధర్మపురి 44.6, ఇబ్రహింపట్నం 44.6, పెగడపల్లి 44.5, KTRL 44.5, సారంగాపూర్ 44.5, రాయికల్ 44.4, MTPL 44.3, భీమారం 44.3, JGTL రూరల్ 43.6, మేడిపల్లి 43.7, మల్యాల 43.7, JGTL 43.2, కథలాపూర్ 43.2, కొడిమ్యాల 42℃ ఉష్ణోగ్రత నమోదైంది. 

error: Content is protected !!