News September 24, 2024

నకరికల్లు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కీలం రామయ్య 41 అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున అద్దంకి-నార్కెట్ పల్లి రాష్ట్ర రహదారిపై చోటు చేసుకుంది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు పోలీస్ పెట్రోలింగ్ వాహనం తిరుగుతున్న సమయంలో మృతదేహాన్ని గమనించారు. కాగా మృతుడు పిడుగురాళ్లలోని సున్నం మిల్లులో పనిచేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 4, 2026

GNT: సంక్రాంతి వేళ.. కోడి పందేల మార్కెట్ వేడి

image

సంక్రాంతి పండుగ దగ్గరపడుతుండటంతో కోడి పందేల కోసం కోళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఉమ్మడి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ప్రత్యేకంగా పెంచిన పందెం కోళ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. సాధారణ కోళ్లు రూ.10,000 నుంచి ప్రారంభమై, జాతి, శిక్షణ, బరువు ఆధారంగా రూ.50,000 వరకు ధర పలుకుతున్నాయి. అక్రమంగా జరుగుతున్న పందేలపై నిఘా పెంచినప్పటికీ, డిమాండ్ మాత్రం తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

News January 4, 2026

GNT: త్రిపుర గవర్నర్‌కి ఘన స్వాగతం

image

గుంటూరు విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డికి ఆదివారం ఘన స్వాగతం లభించింది. ఐటీసీ వెల్కమ్ హోటల్ వద్ద అదనపు ఎస్పీ హనుమంతు, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్రసారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో గవర్నర్ పాల్గొంటారు.

News January 4, 2026

తెనాలి: షార్ట్ ఫిల్మ్ పోటీలకు భారీ స్పందన

image

తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 11న నిర్వహించనున్న మా-ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అపూర్వ స్పందన లభించిందని దర్శకుడు దిలీప్ రాజ తెలిపారు. ఆదివారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి 203 లఘు చిత్రాలు పోటీకి వచ్చాయన్నారు. యువతలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ వేదికను సిద్ధం చేశామన్నారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు సినీ, కళారంగ ప్రముఖుల జ్ఞాపకార్థం నగదు బహుమతులు అందజేస్తామన్నారు.