News September 24, 2024
నకరికల్లు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కీలం రామయ్య 41 అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున అద్దంకి-నార్కెట్ పల్లి రాష్ట్ర రహదారిపై చోటు చేసుకుంది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు పోలీస్ పెట్రోలింగ్ వాహనం తిరుగుతున్న సమయంలో మృతదేహాన్ని గమనించారు. కాగా మృతుడు పిడుగురాళ్లలోని సున్నం మిల్లులో పనిచేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 9, 2024
రాష్ట్రస్థాయి జట్టుకు శావల్యాపురం విద్యార్థిని ఎంపిక
శావల్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.కావ్య బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల పీడీ రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్‌లో నాగపూర్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీలలో కావ్య పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి విద్యార్థినిని అభినందించారు.
News October 9, 2024
నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు: కలెక్టర్
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం సాయంత్రం మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనల మేరకు ఆయకట్టు, డిస్ట్రిబ్యూటరీలు, ప్రాజెక్టుల పరిధిలో వచ్చిన ప్రాంతాలను కలిపి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
News October 9, 2024
14 నుంచి పల్లె పండగ-పంచాయతీ వారోత్సవాలు: కలెక్టర్
పల్లె పండగ-పంచాయతీ వారోత్సవాలను జిల్లాలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 14 నుంచి 20వ తేదీ వరకు పంచాయతీ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, రూ.15.35కోట్లతో 176 పనులకు పరిపాలన మంజూరుకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. 160 సీసీ రోడ్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.