News March 19, 2025

నకరికల్లు: రీ సర్వేపై రైతులతో మాట్లాడిన కలెక్టర్

image

నకరికల్లు మండలంలో జరుగుతున్న రీ సర్వేపై కలెక్టర్‌ అరుణ్ బాబు నేరుగా రైతులతో బుధవారం మాట్లాడారు. సర్వే వివరాలను పూర్తిస్థాయిలో రైతులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. రైతుల వైపుగా ఉండే ఇబ్బందులు, సర్వేకు సంబంధించిన సమస్యలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కచ్చితమైన వివరాలతో విస్తరణతో సర్వేను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. 

Similar News

News December 5, 2025

వారంలో 100 టన్నులు అమ్మేశారు..

image

వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో దేశవ్యాప్తంగా ప్రజలు దీనిని ‘క్యాష్’ చేసుకున్నారు. ఇంట్లో ఉండే వెండిని భారీగా అమ్మేశారు. కేవలం వారంలోనే సుమారు 100 టన్నుల పాత వెండి మార్కెట్‌కు వచ్చినట్లు IBJA అంచనా వేసింది. సాధారణంగా నెలకు 10-15 టన్నులు మార్కెట్‌కు వచ్చేది. KG వెండి ధర రూ.1.90,000కు చేరుకోవడంతో లాభాల కోసం కుటుంబాలు దుకాణాలకు క్యూ కట్టాయి. పెళ్లిళ్లు, పండుగలు, ఖర్చులు కూడా అమ్మకాలకు ఓ కారణం.

News December 5, 2025

నెల్లూరు: 2.94 లక్షల చిన్నారులకు పోలియో చుక్కలే లక్ష్యం.!

image

నెల్లూరు జిల్లాలో ఈనెల 21వ తేదీన పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్న 2,94,140 మంది చిన్నారులకు ఈ చుక్కల మందును వేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 52 PHC, 28 UPHCల పరిధిలో 80 కేంద్రాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు.

News December 5, 2025

వరి కోయ కాలు కాల్చితే భూమి నిర్వీర్యం: DAO

image

PDPL వ్యవసాయశాఖ రైతులకు కీలక సూచనలు జారీ చేసింది. వరి కోయ కాలు కాల్చడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశించి భూమి నిర్వీర్యమై పంట దిగుబడి తగ్గిపోతుందని DAO శ్రీనివాస్ స్పష్టం చేశారు. పంటావశేషాలను కాల్చకుండా సూపర్ పాస్ఫేట్‌ చల్లి నీరు పెట్టి దున్నితే సేంద్రియ పదార్థం పెరిగి ఎరువుల ఖర్చు తగ్గి, పంటల ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు. రైతులు ఈ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.