News March 27, 2025
నకిరేకల్: ఎగ్జామ్స్ రాసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్

తన <<15867903>>డిబార్‌ను రద్దు<<>> చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని శాలిగౌరారానికి చెందిన ఝాన్సీలక్ష్మి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ, NLG DEO, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, నకిరేకల్ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారని విద్యార్థిని పేరెంట్స్ తెలిపారు. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News April 2, 2025
NLG: ఇప్పుడే ఇలా.. మున్ముందు ఇంకెలాగో!

వేసవికాలం అంటే ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటం సాధారణం. కానీ జిల్లాలో ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెల్లవారడమే ఆలస్యం అన్నట్లుగా ఉదయం నుంచే సూర్య ప్రతాపం ప్రారంభం అవుతుండటంతో జనం ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటుంది. ఏప్రిల్ ప్రారంభంలోనే ఇలా ఉంటే ఈనెల చివరి వరకు, మేలో ఎండల ప్రభావం ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
News April 2, 2025
NLG: ట్యాంకర్లతో పంట రక్షణ

జిల్లాలో వరి చేలు చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపొతున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు కొత్తగా బోర్లు వేస్తుండగా మరికొంత మంది గ్రామాల్లోని ట్యాంకర్ల ద్వారా నీటి తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. ఇలా ప్రతి గ్రామంలో రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు అందిస్తుండడంతో ట్యాంకర్ల యజమానులకు ఉపాధి లభిస్తోంది. వీరు ఒక్క ట్యాంకర్‌కు రూ.1000 వరకు తీసుకుంటున్నారని తెలిపారు.
News April 2, 2025
నల్గొండలో భూప్రకంపనలు?

నల్గొండలో నిన్న పలుమార్లు భూకంపం వచ్చినట్లు పుకార్లు షికార్లు చేశాయి. పట్టణంలోని HYDరోడ్డు, మీర్బాగ్ కాలనీతోపాటు వివిధ ప్రాంతాల్లో భూమి కంపించిదంటూ వాట్సప్‌లలో చక్కర్లు కొట్టడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్ని సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించినట్లు SMలో సైతం వైరలైంది. మీర్బాగ్ కాలనీవాసులు మాత్రం అసలు అలాంటిది ఏమి లేదని తెలిపారు. ఇదంతా పుకారేనని తెలియడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.