News March 3, 2025
నకిరేకల్: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

నకిరేకల్ (M) తాటికల్లు ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సూర్యాపేట జిల్లా తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన ప్రభు, గుర్తుతెలియని మహిళ మృతి చెందారు. సూర్యాపేట నుంచి HYDకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కొడుకు మరణంపై మృతుడి తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News March 4, 2025
NLG: టీచర్ MLC ఎన్నికలు.. ‘ఏక్’ నిరంజన్!

NLG – KMM – WGL టీచర్ MLC ఎన్నికల ఫలితాల్లో ఓ అభ్యర్థి ఒకటే ఓటు వచ్చింది. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో బంకా రాజు-7, కంటె సాయన్న-5, చలిక చంద్రశేకర్-1 సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితమయ్యారు. కాగా.. మరో ఆరుగురు తాటికొండ వెంకటయ్య-39, జంగిటి కైలాసం-26, పన్నాల గోపాల్‌రెడ్డి-24, అర్వ స్వాతి-20, లింగిడివెంకటేశ్వర్లు-15, పురుషోత్తంరెడ్డి-11 డబుల్ డిజిట్ ఓట్లతో సరిపెట్టుకున్నారు.
News March 4, 2025
నల్గొండ: కోదండరామ్ మద్దతిచ్చిన వ్యక్తికి 24 ఓట్లు

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోదండరాం మద్దతు ఇచ్చిన పన్నాల గోపాల్ రెడ్డికి 24 ఓట్లు రావడంతో కోదండరామ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రచారం చేస్తే 24 ఓట్లు రావడం ఏంటని మేధావులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.
News March 4, 2025
నల్గొండ: శ్రీపాల్ రెడ్డికి 13,969 ఓట్లు

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. పీఆర్టియూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డితో పోటీపడి 13,969 ఓట్లు సాధించారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఆసాంతం ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. చివరకు మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్‌తోనే శ్రీపాల్ రెడ్డి గెలుపు ఖరారైంది.