News June 23, 2024
నకిరేకల్, నల్గొండ నాకు రెండు కళ్లు: మంత్రి కోమటిరెడ్డి
తాను అధికారంలో ఉన్నా లేకున్నా చచ్చేంత వరకు ప్రజల్లోనే ఉండి ప్రజాసేవకే తన జీవితం అంకితం చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చిట్యాలలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లతో సమానమన్నారు. తన రాజకీయ ప్రస్థానం చిట్యాల నుంచే ప్రారంభమైందని, చిట్యాలకు తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు.
Similar News
News November 3, 2024
వచ్చే ఏడాది మే నాటికి 4,000 మెగావాట్లు గ్రిడ్‌కు అనుసంధానం: Dy.CM
యాదాద్రి పవర్ స్టేషన్‌ను వచ్చే ఏడాది మే నాటికి పూర్తిచేసి 4000 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో మంత్రుల బృందం ఆదివారం పర్యటించింది. యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్లో విద్యుత్తు ఉత్పత్తి గ్రిడ్‌కు అనుసంధానం చేసే కార్యక్రమం విజయవంతమైందని డిప్యూటీ CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
News November 3, 2024
NLG: కానిస్టేబుల్‌ను బలి తీసుకున్న ఆర్థిక సమస్యలు
ఆర్థిక సమస్యలే కానిస్టేబుల్‌ను బలి తీసుకున్నాయి. నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన కటుకూరి రవిశంకర్ (42) నల్గొండ పట్టణంలోని పూజిత అపార్ట్‌మెంట్‌లో నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. యాదగిరిగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రవిశంకర్ ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లి వెంకటమ్మ నల్గొండ టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
News November 3, 2024
NLG: గుండ్లపల్లి కాలువ వద్ద దామోదర్ మృతదేహం లభ్యం
కనగల్ మండలం షాబ్దుల్లాపురం కాలువలో <<14512610>>తండ్రి, కొడుకులు గల్లంతు<<>> కాగా నేడు ఉదయం సురవరం దామోదర్ మృతదేహం లభ్యమైంది. నల్లగొండ పరిధిలోని గుండ్లపల్లి వద్ద కాలువలో నేడు ఉదయం తండ్రి అయిన దామోదర్ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా కుమారుడు ఫణింద్ర వర్మ ఆచూకీ ఇంకా లభించ లేదు.