News July 24, 2024

నకిరేకల్: మంగళపల్లిలో విష జ్వరాల విజృంభన

image

నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో మొత్తం 2,810 మంది ఉన్నారు. ప్రతి ఇంటిలో ఇద్దరు నుంచి ముగ్గురికి పైనే జ్వరాలు బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరాల బారిన పడిన ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి మందులు అందజేశారు.

Similar News

News December 8, 2025

కట్టంగూరు: బాండ్‌ పేపర్‌పై హామీ.. నెరవేర్చకుంటే రిజైన్‌..!

image

తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సర్పంచ్‌ పదవికి రాజీనామా చేస్తానని అభ్యర్థిని శ్రీపాద పుష్పలత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రూ.100 బాండ్‌ పేపర్‌పై ఆమె హామీలను లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. తనను గెలిపిస్తే గ్రామంలో మరో అండర్‌పాస్‌ నిర్మాణం కోసం పోరాడతానని, రెండేళ్లలో అండర్‌పాస్‌ సాధించని పక్షంలో రాజీనామా చేస్తానని ప్రజల సమక్షంలో ప్రకటించారు.

News December 7, 2025

మిర్యాలగూడ డివిజన్ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

నల్గొండ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మిర్యాలగూడ డివిజన్‌లో విధులు నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ను ఆదివారం జిల్లా పరిశీలకురాలు కొర్ర లక్ష్మి పర్యవేక్షణలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఛాంబర్‌లో నిర్వహించారు. డివిజన్‌లోని పది మండలాల్లో 2,418 పోలింగ్ కేంద్రాలకు సరిగ్గా 2,418 బృందాలను కేటాయించారు.

News December 7, 2025

NLG: స్థానిక పోరు.. కూలీలు లేరు..!

image

స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం నల్గొండ జిల్లాలో జోరందుకుంది. అభ్యర్థులు, వారి బంధువులు, సమర్థకులు ప్రచారంలో నిమగ్నం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత తీవ్రమైంది. ఫలితంగా, ప్రస్తుతం యాసంగి సాగు పనులు చేపడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరకక పోవడంతో పొలాల్లో పనులు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.