News January 29, 2025
నకిరేకల్: సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేత

నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3 నుండి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆలయ అర్చకులతో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
Similar News
News October 31, 2025
NLG: శిశు విక్రయాలకు అడ్డుకట్టపడేదెప్పుడో!

జిల్లాలో శిశు విక్రయాలు కలకలం రేపుతున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, అధిక సంతానం కారణంగానే జిల్లాలో ఎక్కువగా గిరిజన తండాల్లో శిశు విక్రయ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. ఎవరికీ తెలియకుండానే పసిపిల్లల విక్రయాలు సాగుతున్నాయన్న చర్చ జరుగుతోంది. జిల్లాలో 2020 నుంచి ఇప్పటివరకు సుమారుగా 52 శిశు విక్రయాలు జరిగినట్లు తెలుస్తుంది. శిశువిక్రయాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
News October 31, 2025
NLG: 6.7 KM పొడవునా దెబ్బతిన్న రోడ్లు

జిల్లాలో రోడ్డు భవనాల శాఖ పరిధిలోని 24 ప్రాంతాల్లో 6.7 కిలోమీటర్ల పొడవున రోడ్లు దెబ్బతినగా అందులో 15 ప్రాంతాల్లో పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాటిల్లో గురువారం 7 ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. వాటి తాత్కాలిక మరమ్మతులకు రూ.35 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. శాశ్వత మరమ్మతులకు రూ.9.70 కోట్లు అవసరమని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.
News October 31, 2025
NLG: రూ.కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు

బకాయిల వసూళ్ల విషయంలో నల్గొండ మున్సిపల్ రెవెన్యూ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రూ.కోట్లలో రావాల్సి ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా పనిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో ఈ ఏడాది ఆస్తి పన్ను రూ.9.30 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇకపోతే పాత బకాయిలు రూ. 33.80 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రూ.43.11 కోట్లు ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి.


