News January 25, 2025

నకిలీ నోట్ల ముఠా పట్టుకున్న సిబ్బందికి నగదు రివార్డు అందించిన సీపీ

image

కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నోట్ల ముఠాను పట్టుకొని నిందితుల నుంచి పెద్ద మొత్తంలో అసలు, నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా నిలిచిన కానిస్టేబుల్ శ్యాంరాజ్, హోంగార్డ్ రాజేందర్‌ను సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందిచి నగదు రివార్డులను అందజేశారు. విధి నిర్వహణ ప్రతిభ కనబరిచిన సిబ్బంది శాఖ పరమైన గుర్తింపు లభిస్తుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Similar News

News November 4, 2025

రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి విద్యార్థి ఎంపిక

image

SGFI రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి మారావతు సుదర్శన్ ఎంపికైనట్లు HM పి. కరీమున్ బీబీ తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి చెస్ పోటీలలో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థికి అభినందనలు తెలియజేశారు.

News November 4, 2025

స్టూడియో ఫ్లాట్స్‌కు పెరుగుతున్న డిమాండ్

image

విశాఖలో స్టూడియో ఫ్లాట్స్‌కు డిమాండ్ పెరుగుతోందని CREDAI తెలిపింది. టెక్ కంపెనీలు వస్తున్న వైజాగ్‌లో ఇలాంటి అపార్టుమెంట్లు 30 వరకు, అన్నీ ఫుల్ అయ్యాయని పేర్కొంది. 400-600Sft సైజులో లేటెస్ట్ ఫీచర్లతో లివింగ్, కిచెన్, బెడ్ రూం కలిపి ఉండేవే స్టూడియో ఫ్లాట్స్/సర్వీస్ అపార్ట్మెంట్స్. ప్రాజెక్టు పనులపై వచ్చే గెస్ట్ ఉద్యోగులు ఇంటి అనుభూతి కోరుకుంటే.. రోజులు-వారాల కోసం కంపెనీలు వీటిని అద్దెకు తీసుకుంటాయి.

News November 4, 2025

టీ/కాఫీ తాగకపోతే హెడేక్ ఎందుకు వస్తుందంటే?

image

అనుకోకుండా టీ/కాఫీ మానేస్తే చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. దీనిపై డాక్టర్ సుధీర్ కుమార్ వివరణ ఇచ్చారు. ‘కాఫీ తాగకపోతే తలనొప్పి రావడం ఊహ కాదు. అది కెఫీన్ విత్‌డ్రాయల్ లక్షణం. అడెనోసిన్ అనే నిద్రమత్తు రసాయనాన్ని కెఫీన్ అడ్డుకుంటుంది. అకస్మాత్తుగా కాఫీ/టీ మానేస్తే అడెనోసిన్ మెదడులోకి వెళ్లి రక్తనాళాలు విస్తరిస్తాయి. దీంతో తలనొప్పి, అలసట, చిరాకు వంటివి కనిపిస్తాయి’ అని తెలిపారు.