News April 16, 2025
నకిలీ విత్తనాలను సమన్వయంతో అరికడదాం: కలెక్టర్

నకిలీ విత్తనాలను సమన్వయంతో అరికడదామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. మంగళవారం శివనగర్‌లోని ఓ కన్వెన్షన్ హలులో విత్తనాలు, ఎరువుల, క్రిమిసంహారక మందుల కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ అంకిత్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అనురాధతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. నకిలీ పురుగుల మందులు అమ్మితే పీడీ యాక్టు నమోదుతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 16, 2025
వరంగల్: చాక్లెట్ కోసం వెళ్లి అనంత లోకాలకు..

చెన్నారావుపేట మం. పుల్లయ్యబోడు తండాలో మంగళవారం <<16107593>>టిప్పర్ ఢీకొని<<>> రెండో తరగతి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన వెంకన్న-జ్యోతికి కూతురు, కొడుకు. అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కొడుకు అనిల్(8) చాక్లెట్ కొనుక్కోవడానికి షాప్‌కు వెళ్లాడు. నెక్కొండ నుంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
News April 16, 2025
నిందితుడికి జీవిత ఖైదు.. పోలీసులకు సత్కారం

వరంగల్ కమిషనరేట్ పరిధి గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధి బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడటంతో కృషి చేసిన వారిని డీసీపీ అంకిత్ కుమార్ సత్కరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రవికిరణ్, మర్రి వాసుదేవ రెడ్డి, భరోసా లీగల్ అడ్వైజర్ నీరజ, ఏసీపీ తిరుపతి, ఇన్స్పెక్టర్ బాబూలాల్, మహేందర్, హెడ్ కానిస్టేబుల్ విజేందర్, కానిస్టేబుళ్లు శ్రవణ్, యుగంధర్‌ను ఆయన అభినందించారు.
News April 16, 2025
భూభారతిపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్యశారదా దేవి పాల్గొన్నారు. భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత తహశీల్దార్లకు కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ జి సంధ్యా రాణి తదితరులున్నారు.