News January 22, 2025
నకిలీ హాల్ టికెట్‌తో అడ్డంగా దొరికిపోయాడు!

కర్నూలులో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో ఓ యువకుడు నకిలీ హాల్ టికెట్ సృష్టించి దొరికిపోయాడు. కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన తిరుమల ఛాతీ, ఎత్తు కొలతల్లో ఫెయిలయ్యాడు. అర్హుడైనట్లు నకిలీ హాల్ టికెట్ సృష్టించి 1,600M పరుగులో పాల్గొనేందుకు వచ్చాడు. ఇదివరకే ఫెయిలయిన వివరాలు కంప్యూటర్‌లో నమోదు కావడంతో అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Similar News
News February 11, 2025
ఛాంపియన్‌గా కర్నూలు జిల్లా జట్టు

యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా పెద్దపాడులోని ఓ పాఠశాల నందు నిర్వహిస్తున్న 1వ రాష్ట్ర స్థాయి యోగా లీగ్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కేఎంసీ డిప్యూటీ మేయర్ రేణుక ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందించారు. కర్నూలు, అనంతపూర్, నంద్యాల జిల్లా జట్లు వరుసగా మూడు స్థానాలలో నిలిచాయి.
News February 10, 2025
మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి!

కర్నూలు జిల్లా పరిధిలోని గీత కులాలకు సంబంధించి 10 మద్యం షాపులకు మొత్తం 133 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దరఖాస్తులను జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారుల పరిశీలన అనంతరం సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ నవ్య లాటరీ పద్ధతిలో కేటాయించారు. 10 షాపులు దక్కించుకున్న వారి పేర్లను ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
News February 10, 2025
కర్నూలు జిల్లా న్యూస్ రౌండప్

☞ నేడు కర్నూలులో ప్రజా పరిష్కార వేదిక
☞ గీత కులాల మద్యం షాపులకు నేడు లాటరీ
☞ 6,42,391 మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
☞ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 659 మందిపై కేసులు
☞ రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన 23ఏళ్ల యువకుడి మృతి
☞ శ్రీరంగాపురంలో నేడు ఆరాధన
☞ చెట్నిహళ్లిలో మళ్లీ వివాదం.. అంత్యక్రియల అడ్డగింత
☞ నేడు శ్రీశైలానికి ఐదుగురు మంత్రుల బృందం