News March 21, 2025
నక్కపల్లి: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

నక్కపల్లి మండలం నల్లమట్టిపాలెంకు చెందిన ఎన్.రాము (54) రాజయ్యపేట శివారు కల్లుపాకల వద్ద అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 19న పొలానికి వెళ్లిన రాము ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా గురువారం కల్లుపాకల వద్ద శవమై కనిపించాడు. ఇతని మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నందున కుటుంబ సభ్యులు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు.
Similar News
News November 25, 2025
VKB: పట్లోళ్ల రఘువీర్ రెడ్డికి డీసీసీ ఇస్తే.. నా పదవికి రాజీనామా చేస్తా!

పట్లోళ్ల రఘువీర్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి ఇస్తే.. తాను తన రాజ్యాంగబద్ధమైన పదవికి రాజీనామా చేస్తానని ఓ ప్రముఖ నాయకుడు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. రఘువీరా రెడ్డికి డీసీసీ పదవి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని ఆయన గట్టిగా సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ వర్గాల్లో ఈ అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
News November 25, 2025
కుల్దీప్ యాదవ్ @134

ఇదేంటి అనుకుంటున్నారా? దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో కుల్దీప్ యాదవ్ ఎదుర్కొన్న బంతుల సంఖ్య. 11 మందిలో 100 బంతులకుపైగా ఎదుర్కొన్నది ఆయనే కావడం గమనార్హం. 134 బంతులను ఎదుర్కొన్న కుల్దీప్ 19 పరుగులు చేశారు. జైస్వాల్ 58(97), సుందర్ 42(92) చేశారు. కాగా రెండో ఇన్నింగ్సులోనైనా వీలైనంత ఎక్కువ టైమ్ క్రీజులో ఉంటేనే భారత్ ఓటమి నుంచి తప్పించుకోవచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.
News November 25, 2025
అనంత: ఆ నిందితులకు 14 రోజుల రిమాండ్

అనంతపురం సాయి నగర్ 3rd క్రాస్‌లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై దాడిచేసి ధ్వంసం చేసిన ఘటనలో అడ్వకేట్ మొగలి సత్యనారాయణరెడ్డితోపాటు మొత్తం ఏడుగురుని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు. నిందితులను 14 రోజులపాటు రిమాండ్‌కు తరలించామన్నారు. దాడికి ఉపయోగించిన మూడు కార్లు ఒక మోటార్ సైకిల్ మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.


