News March 21, 2025

నక్కపల్లి: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

నక్కపల్లి మండలం నల్లమట్టిపాలెంకు చెందిన ఎన్.రాము (54) రాజయ్యపేట శివారు కల్లుపాకల వద్ద అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 19న పొలానికి వెళ్లిన రాము ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా గురువారం కల్లుపాకల వద్ద శవమై కనిపించాడు. ఇతని మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నందున కుటుంబ సభ్యులు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు.

Similar News

News July 6, 2025

ప్ర‌చార ర‌థం ప్రారంభమయ్యేది అప్పుడే

image

జులై 9న మ‌.2 గంట‌ల‌కు సింహాచలం గిరిప్రదక్షిణ ప్ర‌చారర‌థం ప్రారంభమవుతుందని ఈవో త్రినాథ‌రావు కలెక్టర్‌కు వివరించారు. తొలిపావంచా వ‌ద్ద అశోక్ గ‌జ‌ప‌తి చేతుల మీదుగా ప్ర‌చారర‌థం ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. ఆరోజు రాత్రి 11 గంట‌లకు ర‌థం ఆల‌యానికి చేరుకుంటుంద‌ని, మరుసటి రోజు ఉ.5 నుంచి స్వామివారి ద‌ర్శ‌నాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు.10వ తేదీ సాయంత్రం 7వ‌ర‌కు ద‌ర్శ‌నాలు ఉంటాయన్నారు.

News July 6, 2025

ఈనెల 10న మెగా పేరెంట్ మీట్: కలెక్టర్

image

జిల్లాలని అన్ని పాఠశాలల్లో ఈనెల 10న మెగా పేరెంట్ మీట్ నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న 1385 పాఠశాలల్లో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో హాజరవ్వాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకంలో అతిథిలకు స్కూల్లోనే భోజనం అందించాలన్నారు 212 జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు.

News July 6, 2025

ఆ సమయంలో 9 రోజులు అన్నం ముట్టను: హీరోయిన్

image

తాను ఏడాదికి రెండు సార్లు ఉపవాసం ఉంటానని హీరోయిన్ నర్గీస్ ఫక్రీ తెలిపారు. ఆ సమయంలో 9 రోజులపాటు ఏమీ తిననని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఉపవాసం చేసినన్ని రోజులు నీళ్లు తాగే బతుకుతా. ఫాస్టింగ్ అయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కానీ ముఖంలో కాస్త గ్లో ఉంటుంది. ఉపవాసం అయిపోయాక హై ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటా’ అని చెప్పుకొచ్చారు. కాగా నర్గీస్ ఇటీవల విడుదలైన ‘హౌస్‌ఫుల్ 5‘ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.