News February 2, 2025
నక్కపల్లి: చెరువులో పడి వ్యక్తి మృతి

నక్కపల్లి మండలం మనబాలవానిపాలెం సమీపంలోని చెరువులో అదే గ్రామానికి చెందిన గొర్ల రమణ (42) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ పడి మరణించినట్లు సీఐ కె.కుమారస్వామి ఆదివారం తెలిపారు. గత నెల 31న రమణ ఇంటి నుంచి బయటకు వెళ్లి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. గ్రామానికి సమీపంలో చర్చి వెనుక ఉన్న చెరువులో అతని మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు.
Similar News
News February 16, 2025
ఖమ్మం: మృతదేహం లభ్యం.. హత్య? ఆత్మహత్య?

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం- మేడిదపల్లి గ్రామాల మధ్యలో ఉన్న కాల్వకట్ట పక్కన గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య?.. లేదా హత్య?.. అనే కోణంలో విచారిస్తున్నారు. మృతుడు పాతర్లపాడుకు చెందిన కొల్ల సైదులుగా గుర్తించారు.
News February 16, 2025
మెదక్: భార్య మృతిని తట్టుకోలేక భర్త సూసైడ్

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలిపిచేడ్‌లో జరిగింది. ఎస్ఐ నర్సింహులు వివరాలు.. HYDకి చెందిన జగన్ రావు(60) భార్య మూడు నెలల కింద మృతి చెందడంతో మనస్థాపం చెంది మండలంలోని చిట్కుల్ శివారులో చాముండేశ్వరీ ఆలయ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు సంతోశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
News February 16, 2025
కరీంనగర్: చికిత్స పొందుతూ యువరైతు మృతి

శంకరపట్నం(M) ఇప్పలపల్లె గ్రామానికి చెందిన ఏడీగ మధు(33) అనే ఓ యువరైతు 6రోజుల క్రితం తన ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. గమనించిన చుట్టుపక్కల వారు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.