News April 14, 2025
నక్కపల్లి: నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

సముద్రంలో సోమవారం అర్ధరాత్రి నుంచి జూన్ 15వ తేదీ వరకు చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా రెండు నెలలకు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తుంది. అనకాపల్లి జిల్లాలో గల తీరప్రాంతాలైన అచ్యుతాపురం, పాయకరావుపేట, పరవాడ, రాంబిల్లి, ఎస్ రాయవరం, నక్కపల్లిలో మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు.
Similar News
News November 26, 2025
విశాఖ రివ్యూ మీటింగ్లో MLA మద్దిపాటి

ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బుధవారం విశాఖ కలెక్టరేట్లో జరిగిన అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యుని హోదాలో రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ ఎస్టిమేట్కి సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, విశాఖ కలెక్టర్తో పాటుగా ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News November 26, 2025
ఏలూరులో మంత్రి మనోహర్ నేతృత్వంలో జిల్లా సమీక్ష

ఏలూరు కలెక్టరేట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జిల్లా సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు, గృహాల పురోగతి, 22A కేసులు, విశాఖ CII సమ్మిట్ అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వీ వివిధ శాఖల పురోగతిపై నివేదిక ఇచ్చారు. మంత్రి పార్థసారథి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జాయింట్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
News November 26, 2025
బెట్టింగ్లతో అప్పులు.. గన్ తాకట్టు పెట్టిన ఎస్ఐ!

TG: హైదరాబాద్ అంబర్పేట్ SI గన్ మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఓ కేసులో రికవరీ చేసిన బంగారంతోపాటు తన సర్వీస్ గన్ను SI భాను ప్రకాశ్ తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. భారీగా అప్పులు చేశారని, బెట్టింగ్లో రూ.80 లక్షలు పోగొట్టుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగారం, తుపాకీ తాకట్టు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భాను ప్రకాశ్ను టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది.


