News March 28, 2024

నక్కపల్లి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

నక్కపల్లి మండలం గుల్లిపాడు, నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్ల మధ్య మృతదేహం లభ్యమయ్యింది. విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి గురువారం ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు తుని రైల్వే ఎస్సై షేక్ అబ్దుల్ మరూఫ్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలుంటాయని, అతని వివరాలు తెలియలేదన్నారు. తుని ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచామని చెప్పారు.

Similar News

News September 16, 2025

విశాఖ చేరుకున్న నిర్మలా సీతారామన్

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. రేపు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమలు కానుంది. దీంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమంతో పాటు స్వస్థ్‌ నారీ-సశక్త్‌ పరివార్‌ అభియాన్‌లో ఆమె పాల్గొంటారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

News September 16, 2025

గోపాలపట్నంలో దారుణ హత్య

image

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2025

ప్రజలకు విశాఖ సిటీ పోలీసుల హెచ్చరిక

image

విశాఖపట్నం సిటీ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. లోన్ యాప్స్ వలలో పడి అనేక మంది వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. డౌన్లోడ్ చేసిన వెంటనే వ్యక్తిగత సమాచారం దోచుకుని, ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసాలకు గురవకుండా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.