News March 28, 2025

నక్కపల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన RI

image

నక్కపల్లిలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. గత కొంతకాలం నుంచి ఈ కార్యాలయంపై అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొలంలో బోరు కోసం ఒక రైతు నుంచి రూ.12 వేలు లంచం డిమాండ్ చేస్తూ ఆర్ఐ కన్నబాబు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఆర్‌ఐ కన్నబాబును అరెస్ట్ చేశారు.

Similar News

News November 27, 2025

FLASH: MHBD: మహమూద్ పట్నం ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

image

మహబూబాబాద్ జిల్లా మహమూద్ పట్నం పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్, మూడు వార్డు స్థానాలు రిజర్వ్ చేశారంటూ గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎలా రిజర్వ్ చేశారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆరుగురు ఎస్టీ ఓటర్లు, ఒకటే వార్డులో ఉంటే, మిగతా వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని హైకోర్టు ధర్మాసనం నిలదీసి స్టే విధించింది.

News November 27, 2025

నంద్యాల ఫిజియోథెరపిస్టుకు జాతీయస్థాయి పురస్కారం

image

నంద్యాల జిల్లా ఫిజియోథెరపిస్టుల సంఘం కార్యదర్శి డాక్టర్ శివ బాలి రెడ్డి జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ గౌరవాన్ని పొందారు.
సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రానికి గాను ఆయనకు ఉత్తమ వైజ్ఞానిక పరిశోధన పత్రం పురస్కారం లభించింది. జిల్లాలోని ప్రముఖులు డా. శివ బాలి రెడ్డిని అభినందించారు.

News November 27, 2025

భార్యను చంపిన కేసులో భర్తకి జీవిత ఖైదు: శ్రీకాకుళం ఎస్పీ

image

భార్యను చంపిన కేసులో భర్తకు కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించినట్లు గురువారం శ్రీకాకుళం ఎస్పీ కె.విమహేశ్వరరెడ్డి తెలిపారు. 2018 మార్చి 14వ తేదీన పొందూరు మండలం బాణం గ్రామానికి చెందిన జీరు రమణమ్మను అనుమానంతో భర్త వెంకటరమణ కత్తితో దాడి చేసి హత్యచేశాడు. ఘటనపై ముద్దాయిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చి పరారీలో ఉన్న అతడిని తాజాగా కోర్టులో హాజరుపరచగా జీవిత ఖైదు విధించారు.