News April 6, 2025
నక్కపల్లి: విద్యుదాఘాతంతో సజీవ దహనం

తెగిన విద్యుత్తు తీగపై అడుగేసిన ఓ రైతు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన నక్కపల్లి మండలం జానకయ్యపేటలో శనివారం జరిగింది. పోలీసులకు రైతులు సమాచారం ఇచ్చారు. మృతుడు తాతబ్బాయి అని కుటుంబసభ్యులు గుర్తించడంతో ఎస్ఐ సన్నిబాబు కేసు నమోదు చేశారు.
Similar News
News November 14, 2025
23వేల ఆధిక్యంలో నవీన్ యాదవ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ లీడ్ భారీగా పెరుగుతోంది. 8వ రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ 23వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా 8 రౌండ్లలో ఆయన లీడ్ సాధించడం విశేషం. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి.
News November 14, 2025
ఆ భవనాలు IT Hub కోసం కాదు: అధికారులు

TG: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాలను ఐటీ హబ్ కోసం ఉపయోగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. అవి తప్పుడు వార్తలని స్పష్టం చేశారు. అధునాతన ఆరోగ్య సేవలను అందించడానికి ప్రభుత్వం త్వరలో సనత్నగర్ TIMS, వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 14, 2025
మంచిర్యాల: ‘శబరికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి’

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం మంచిర్యాల నుంచి శబరి కి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కేరళ ఎక్స్ప్రెస్ కు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని బీజేపీ పార్టీ నాయకులు కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ సికింద్రాబాద్ లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ ను కలిసి వినతిపత్రం అందజేశారు. చెన్నై సెంట్రల్ నుంచి భగత్ కి రాజస్థాన్ వరకు నడుస్తున్న రైలుకు హాల్టింగ్ కల్పించాలన్నారు.


